భూ రికార్డుల ఆధునీకరణకు రీ–సర్వే | - | Sakshi
Sakshi News home page

భూ రికార్డుల ఆధునీకరణకు రీ–సర్వే

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

అమలాపురం రూరల్‌: జిల్లాలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి చేపట్టిన రీ–సర్వే పారదర్శకంగా, శాసీ్త్రయ పద్ధతుల్లో చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధా న కార్యదర్శి సాయిప్రసాద్‌, భూ పరిపాలన ముఖ్య కమిషనర్‌ జయలక్ష్మి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ రెవెన్యూ, సర్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతుల భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తూ వారి సమక్షంలో వారి ఆమోదంతోనే భూ సరిహద్దులను నిర్ధారించాలన్నారు. భూ సరిహద్దులు పక్కాగా ఉండేలా అత్యాధునిక రోవర్లను వినియోగించాలన్నారు. రికార్డుల భద్రత కోసం బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని, భూ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పాస్‌ పుస్తకాలపై డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జేసీ వైఖోం నైదియాదేవి, డీఆర్‌ఓ వి.సుబ్బారావు, ఆర్డీవోలు జి .మమ్మీ, జీవీవీ సత్యనారాయణ, ఏ.సరళావతి, జిల్లా అటవీ శాఖ అధికారి ఎంవీ ప్రసాద రావు, సర్వే ల్యాండ్‌ రికార్డ్‌ ఏడీ కే.ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement