వేధింపులు ఆపాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

వేధింపులు ఆపాలని నిరసన

Jun 9 2026 12:12 AM | Updated on Jun 9 2026 12:12 AM

ముమ్మిడివరం: కర్నూలులో అధికారుల వేధింపులకు తట్టుకోలేక వీఆర్‌ఓ హుస్సేన్‌ మృతి చెందాడని ఆరోపిస్తూ సోమవారం స్థానిక తహసీల్దార్‌, నగర పంచాయతీ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. కింది స్థాయి సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించాలని మండలంలో వీఆర్‌ఓలు, సచివాలయ ఉద్యోగులు అన్నారు.

జీతాలు ఇప్పించండి

అమలాపురం రూరల్‌: ఆరు నెలల జీతాలు ఇప్పించాలంటూ జిల్లా సొసైటీ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాల సెక్యూరిటీ సిబ్బంది అమలాపురంలోని కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. జిల్లాలోని ఆరు గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 36 మందికి జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.

● ఓఎన్జీసీ వల్ల నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం ఇవ్వాలని కలెక్టరేట్‌ వద్ద మత్స్యకారులు ఆందోళన చేశారు. జిల్లాలోని కె.గంగవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, అయినవిల్లి మండలాల మత్స్యకారులు వచ్చి ఓఎన్జీసీ చమురు తవ్వకాల వల్ల తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. పరిహారం ఇవ్వాలని బీజేపీ నేత కర్రి చిట్టిబాబు ఆధ్వర్యంలో కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌కు వినతి పత్రం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement