ఆశ కార్యకర్తల నియామకాల్లో అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

ఆశ కార్యకర్తల నియామకాల్లో అక్రమాలు

Jun 9 2026 12:12 AM | Updated on Jun 9 2026 12:12 AM

అమలాపురం రూరల్‌: జిల్లాలో ఆశ కార్యకర్తల నియామకాల్లో నిబంధనలను విస్మరించారంటూ పలువురు అభ్యర్థులు సోమవారం అమలాపురం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ నియామకాల్లో అర్హతలను పక్కనపెట్టి ఎస్సీ, బీసీ వర్గాలకు కేటాయించిన పోస్టులను ఇతరులకు ఇచ్చారని ఆందోళనకారులు అన్నారు. గల్ఫ్‌ దేశం కువైట్‌లో ఉంటున్న కుంచె వెంకటలకి్‌ష్మ్‌కి ఆశ వర్కర్‌ ఉద్యోగం కేటాయించడం చాలా దారుణమని అన్నారు. స్థానికంగా అందుబాటులో ఉండి సేవలు అందించాల్సిన ఉద్యోగాన్ని విదేశాల్లో ఉన్న మహిళకు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. నియామక ప్రక్రియలో అవినీతికి పాల్పడ్డారని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని బాధితులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌కు వినతి పత్రం అందించారు. ఆరోపణలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దుర్గారావు దొరను వివరణ కోరగా, జిల్లాలో 76 ఆశ కార్యకర్తల ఎంపికలో గ్రామ సర్పంచ్‌, ఇతర కమిటీ సిఫార్సు మేరకు ఎంపిక చేశామన్నారు. ఉద్యోగాలు రాని కొందరు ఇలా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement