తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తజనంతో లోవ దేవస్థానం ప్రాంగణం కిక్కిరిపోయింది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 30 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.2,65,276, పూజా టికెట్లకు రూ.5,17,080, కేశఖండనశాలకు రూ.29,640, వాహన పూజలకు రూ.7,550, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.10,309, విరాళాలు రూ.19,545 వెరసి రూ.9,42,400 ఆదాయం సమకూరినట్టు ఈఓ తెలిపారు. శ్రీవారి సేవకులు, సిబ్బందితో కలసి భక్తులకు సౌకర్యాలు కల్పించామన్నారు.


