రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Mar 7 2026 7:28 AM | Updated on Mar 7 2026 7:28 AM

మంటలకు కాలిపోయిన బైక్‌

రాజానగరం: జాతీయ రహదారిపై రాజానగరం గైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బొమ్మూరు పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం శానిటోరియం ప్రాంతానికి చెందిన అందె అఖిల్‌ కుమార్‌ (30) వై–నాట్‌ షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. అతను తన బైక్‌పై రాజానగరంలోని బంధువుల ఇంటికి వచ్చి, తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక గైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల దాటిన తరువాత అతను ప్రయాణిస్తున్న బైకును వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అతని తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతన్ని ఢీకొన్న వాహనం బైక్‌ను కొద్దిదూరం ఈడ్చుకుపోయింది. దీంతో రోడ్డు రాపిడికి ట్యాంకులో పెట్రోలు లీకై , మంటలు వ్యాపించి, బైకు పూర్తిగా కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నా ప్రయోజనం లేకపోయింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బొమ్మూరు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement