బంగారు మకర తోరణం సమర్పణ | - | Sakshi
Sakshi News home page

బంగారు మకర తోరణం సమర్పణ

Mar 7 2026 7:28 AM | Updated on Mar 7 2026 7:28 AM

ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరుని ఆలయంలో స్వామివారికి తణుకుకు చెందిన పుణ్యమూర్తుల రామచంద్రస్వామి, సావిత్రి దంపతులు రూ.60 లక్షల విలువైన బంగారు మకర తోరణాన్ని సమ ర్పించారు. దీనిని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావుకు అందజేశారు. అనంతరం అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా సంప్రోక్షణ నిర్వహించి స్వామివారికి అలంకరించారు. దాతలకు తీర్థ ప్రసాదాలు, స్వామివారి ఫొటో అందజేశారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్‌ సీపీ నాయకులు, ఉప సర్పంచ్‌ పోచిరాజు బాబూరావు, సర్పంచ్‌ సూర్యకుమారి దంపతులు, అయ్యగారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement