ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి
రామచంద్రపురం రూరల్: అనేక మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రామచంద్రపురం మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ రెడ్డి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. రామచంద్రపురం ఆర్టీసీ డిపో గ్యారేజీలో శుక్రవారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. డిపో మేనేజర్ పేపకాయల భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంవీఐ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డిపో మేనేజర్ భాస్కరరావు మాట్లాడుతూ డ్రైవర్లకు మంచి శిక్షణతో కూడిన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాలను ఎలా నివారించవచ్చు అనే అంశంపై వివరించారు. బస్సు కండిషన్‌ను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలన్నారు. సమావేశంలో సీనియర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె.రవికుమార్, అసిస్టెంట్ మెకానిక్ ఫోర్‌మెన్ జి.రవిబాబు తదితరులు పాల్గొన్నారు.


