సైనికుల సంక్షేమానికి విరాళం
అమలాపురం టౌన్: సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని సైనిక, మాజీ సైనికుల సంక్షేమానికి జిల్లా మాజీ సైనికుల సంఘం రూ.63 వేలను విరాళంగా సమకూర్చింది. ఈ మొత్తాన్ని జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావుకు అందజేసినట్టు మాజీ సార్జెంట్ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు.
కాకినాడలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సైనిక అధికారి కార్యాలయంలో శుక్రవారం రూ.63 వేలకు సంబంధించిన చెక్కు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులు రాంబాబు, డీఎన్ మూర్తి, గంగాధర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


