సాగనంపాలనే..
కపిలేశ్వరపురం: ఒక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకోవడా నికి గత అనుభవాలు మార్గదర్శకం అవుతాయి. జరిగి నవి ఘటనలుగా కాకుండా గుణపాఠాలుగా పరిగణించిన రోజున ప్రతి ఘటనా మనసును మీటే ప్రేరకమే అవుతోంది. 2025లో ఎన్నో మజిలీలు.. మరెన్నో విజయాలు, ఓటములు, దుర్ఘటనలు, ప్రకృతి విలాపాల ను ప్రతి ఒక్కరూ చవిచూశారు. ఇవన్నీ చాలవన్నట్టు చంద్రబాబు పాలనతో సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, కర్షక తదితర ప్రజా సంఘాలు సైతం తమదైన శైలిలో పోరాడాయి.
నిరసన.. జోరున
● జనవరి 2: తమను విధుల్లో కొనసాగించి రూ.10 వేలకు గౌరవ వేతనాన్ని పెంచుతామంటూ కూట మి నేతలు ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ వలంటీర్లు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేశారు.
● జనవరి 13: విద్యుత్ బిల్లుల పెంపును నిరసిస్తూ అమలాపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు.
● మార్చి 12: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ యువత పోరు విజయవంతమైంది.
● ఏప్రిల్ 12: ‘సాక్షి’ దినపత్రికపై, ఎడిటర్‌పైనా వేధింపులను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా పత్రికా విలేకరులు ఆందోళన చేశారు.
● ఏప్రిల్ 28: తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లాలో ఆరోగ్య కేంద్రాల్లోని 400 మంది సీహెచ్‌ఓలు సమ్మె చేశారు.
● మే 7: రబీ ధాన్యంలో ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనాలంటూ అమలాపురంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
● జూన్ 23: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా యువత పోరు నిరసన కార్యక్రమం విజయవంతమైంది.
● జూలై 2: ఇందుపల్లిలో జిల్లా స్థాయిలో బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ సభకు వైఎస్సార్ సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు.
● జూన్ 4: జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పేరుతో నిరసన తెలిపారు.
● సెప్టెంబర్ 12, 13: జిల్లాలో సీ్త్రశక్తి పథకంతో రోడ్డున పడిన ఆటో కార్మికులు ఆటోలు బంద్ చేశారు.
● సెప్టెంబర్ 19: వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కామనగరువులో గత ప్రభుత్వం ప్రారంభించిన పభుత్వ వైద్య కళాశాల భవనం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
● డిసెంబర్ 10: ప్రభుత్వ వైద్య కళాశాలల పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులను వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయానికి, 15న తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి భారీ ర్యాలీలతో తరలించారు.
అందరిలో మేటి.. కీర్తి చాటి
● జనవరి 26: ఢిల్లీలోని 76వ గణతంత్ర వేడుకలో ముక్కామలకు చెందిన నాగబాబు కళాకారుల బృందం ఏటికొప్పాక బొమ్మల శకటానికి మూడో స్థానం దక్కింది. కొత్తపేట కళాకారుల గరగ, వీరనాట్యం ప్రదర్శనకు గుర్తింపు దక్కింది.
● మార్చి 9: నేషనల్ డిజైన్ సెంటర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సౌత్ ఇండియా అమృత్ మహోత్సవ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోరీ చేనేత సహకార సంఘం తయారు చేసిన వస్త్రాలను ప్రశంసించారు.
● జూన్ 15: వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫాస్టర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి అమలాపురం మహిళ చావలి శ్రీకావ్య ఎమ్మెస్ డిగ్రీలో టాపర్‌గా నిలిచారు.
● ఆగస్టు 2: లండన్‌లో ఆరేళ్లలోపు పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న కొత్తపేటకు చెందిన తణుకు పూర్ణిమకు బ్రిటిష్ అత్యున్నత కమాండర్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ అంపైర్ (సీబీఈ) పురస్కారాన్ని బ్రిటన్ రాజు చార్లెస్ సోదరి ప్రిన్సెస్ అనీ చేతుల మీదుగా అందజేశారు.
● ఆగస్టు 15: శ్రీకాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ నిర్వాహకులు రావులపాలేనికి చెందిన గొలుగూరి సతీష్‌రెడ్డి, పడాల సోమిరెడ్డి తదితరులను విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్ నజీర్ అభినందించారు.
తుదిశ్వాస విడిచి..
● జూన్ 5: అమలాపురంలో కామాక్షి పీఠం స్థాపకుడు, అనాధాశ్రమం నిర్వాహకుడు కామేశ మహర్షి (87) తుదిశ్వాస విడిచారు.
● నవంబర్ 11: వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ రుద్రరాజు వెంకట సత్యసూర్య అచ్యుత రామరాజు (60) గుండెపోటుతో మృతి చెందారు.
● డిసెంబర్ 13: అమలాపురం మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి (85) ఢిల్లీలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
ఏడాదిలో అనేక ఉద్యమాలు
సమస్యలపై కదం తొక్కిన ప్రజలు
చంద్రబాబు పాలనలో కానరాని కేంద్ర సాయం
కలవరపెట్టిన ప్రముఖుల మరణాలు
అనేక అనుభవాలను మూటకట్టిన 2025
సాగనంపాలనే..


