
విద్యార్థులకు యోగాభ్యాసన కార్యక్రమాలు
అమలాపురం రూరల్: జిల్లాలో ఫైలెట్ ప్రాజెక్టుగా ఎనిమిది సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు యోగాభ్యాసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. శనివారం సమనస మహాత్మ జ్యోతీరావు ఫూలే బీసీ వెల్ఫేర్ బాలుర గురుకులాన్ని సందర్శించి తరగతి గదుల్లో విపశ్యన యోగాపై శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల ప్రారంభానికి పది నిమిషాలు, ముగింపునకు పది నిమిషాల ముందు విపశ్యన ధ్యాన బోధన చేస్తున్నారన్నారు. ఇది సత్ఫలితాలను ఇస్తే తదుపరి అన్ని పాఠశాల్లో దశల వారీగా నిర్వహిస్తామన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా, సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి.మమ్మీ, విపశ్యన యోగా నిపుణుడు అమర్, తహసీల్దార్ అశోక్ ప్రసాద్, పాఠశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.