గత జనవరి నుంచి ఇప్పటి వరకు కౌంట్‌ ధరలు(రూ.ల్లో) ఇలా.. | - | Sakshi
Sakshi News home page

గత జనవరి నుంచి ఇప్పటి వరకు కౌంట్‌ ధరలు(రూ.ల్లో) ఇలా..

Aug 14 2025 7:25 AM | Updated on Aug 14 2025 7:25 AM

గత జన

గత జనవరి నుంచి ఇప్పటి వరకు కౌంట్‌ ధరలు(రూ.ల్లో) ఇలా..

ధరపై తీవ్ర ప్రభావం

రొయ్యల లభ్యత తక్కువగా ఉన్న సమయంలో వాటి కౌంట్లకు మంచి ధర రావడం సాధారణం. ఈసారి కూడా మంచి ధర వచ్చింది. పది రోజుల క్రితం రొయ్యల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. వంద కౌంట్‌ (కిలోకు వంద రొయ్యలు) ధర రూ.265 వరకు ఉండగా, 90 కౌంట్‌ రూ.275గా, 80 కౌంట్‌ రూ.295గా, 70 కౌంట్‌ రూ.325గా, 60 కౌంట్‌ రూ.345గా, 50 కౌంట్‌ రూ.375గా, 40 కౌంట్‌ రూ.395గా, 40 కౌంట్‌ రూ.440 వరకూ ఉండేది. ఈ సమయంలో ట్రంప్‌ రెండోసారి భారతీయ దిగుమతులపై 25 సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీనిని తర్వాత 50 శాతానికి పెంచారు. ప్రస్తుతం 25 శాతం సుంకాలు అమలులో ఉన్నాయి. సుంకాల ప్రకటన తర్వాత వనామి రొయ్యల ధరలను కొనుగోలుదారులు మరోసారి తగ్గించేశారు. కౌంట్‌కు వచ్చి రూ.30 నుంచి రూ.50 వరకూ కోత పెట్టడం గమనార్హం. వంద కౌంట్‌ ధర రూ.235 వరకు తగ్గగా, 90 కౌంట్‌ రూ.245, 80 కౌంట్‌ రూ.265, 70 కౌంట్‌ రూ.285, 60 కౌంట్‌ రూ.305, 50 కౌంట్‌ రూ.325, 40 కౌంట్‌ రూ.345, 30 కౌంట్‌ రూ.390కి పడిపోయాయి.

సాక్షి, అమలాపురం: ఓవైపు కొలుగోలుదారులు సిండికేటుగా మారి ధర పెరిగినప్పుడల్లా ఏదో కారణంతో తగ్గించేస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల దాడితో ఆక్వా రైతులు విలవిల్లాడుతున్నారు. ఏడాది కాలంగా వనామీ రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరిగిన ప్రతిసారీ ఏదోక ఉపద్రవం రావడం.. ధర పతనం కావడం పరిపాటిగా మారింది. ఎటువంటి ఇబ్బందులు లేకున్నా.. స్థానిక కొనుగోలుదారులు ధర తగ్గించి ఆక్వా రైతుల నడ్డివిరుస్తున్నారు. తాజాగా ట్రంప్‌ టారిఫ్‌ ప్రకటనతో మరోసారి వనామీ ధరలు తగ్గడం రైతుల్లో కొత్త ఆందోళనకు తెర తీసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో తీర ప్రాంత మండలాల్లో వనామీ రొయ్యల సాగు అధికంగా సాగుతోంది. కాకినాడ జిల్లాలో సుమారు 8 వేల ఎకరాల్లో ఈసాగు ఉండగా, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో దాదాపు 15 వేల ఎకరాల్లో జరుగుతున్నట్టు అంచనా. ఆయా జిల్లాల్లో మొత్తం 23 వేల ఎకరాల్లో సాగవుతున్నట్టు ఆక్వా వర్గాలు చెబుతున్నాయి. మొదటి పంట పూర్తయి, రెండో పంటకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం కోనసీమ జిల్లావ్యాప్తంగా 20 శాతం మాత్రమే చెరువుల్లో వనామీ రొయ్యలున్నాయి.

సందు దొరికితే..

అంతర్జాతీయంగా ఏ చిన్న సంఘటన జరిగినా దానిని బూచిగా చూపించి రొయ్యల ధరలు తగ్గించడం కొనుగోలుదారులకు పరిపాటిగా మారింది. వీరంతా సిండికేట్‌గా ఉండడంతో ఒకే మాటపై ధరలు తగ్గించేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో వనామీ రొయ్యలకు మంచి ధర పలికింది. మార్కెట్‌కు రొయ్యలు పెద్ద సంఖ్యలో వస్తూండడంతో కౌంట్‌కు రూ.20 చొప్పున ధర తగ్గించారు.

● ఏప్రిల్‌ తొలి వారంలో ట్రంప్‌ టారిఫ్‌ ప్రకటించగానే, దానిని అడ్డుపెట్టుకుని ధరలు భారీగా తగ్గించారు. కౌంట్‌కు రూ.60 వరకు ధర క్షీణించింది. తర్వాత సుంకాల విధింపు మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. కానీ కౌంట్‌కు రూ.15 మాత్రమే ధర పెంచడం గమనార్హం.

● గత నెల నుంచి చెరువులు ఖాళీ అయి మార్కెట్‌కు రొయ్యల రాక తగ్గింది. దీంతో ధరలు మరోసారి పెరిగాయి. ఇదే సమయంలో ట్రంప్‌ సుంకాల ప్రకటన రైతులను కుదేలు చేసింది. వనామి ధరలు మరోసారి పతనమయ్యాయి.

● జిల్లా నుంచి ఎగుమతి అయ్యే వనామీ, సముద్రంలో దొరికే టైగర్‌, ఇతర రొయ్యలు 70 శాతానికి పైగా అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. గతంలో యన్టీ డంపింగ్‌ టాక్స్‌ 4.5 శాతం, డీవీడీ ట్యాక్స్‌ 5 శాతం చొప్పున మొత్తం 9.5 శాతం మాత్రమే టాక్స్‌ ఉండేది. దీనిపై అదనంగా 25 శాతం టాక్స్‌ను ట్రంప్‌ ప్రభుత్వం అమలు చేస్తోంది. అంటే మొత్తం 34.9 శాతం టాక్స్‌ భారం పడుతోంది.

● వాస్తవంగా ట్రంప్‌ టారిఫ్‌ ప్రభావం మొదట పడేది అమెరికాలోని వినియోగదారులపైనే. ఇదే వంకతో కొనుగోలుదారులు ఇక్కడ రొయ్యల కొనుగోలు నిలిపివేశారు. ఇప్పుడు కేవలం 25 శాతం సుంకం ఉండగా, ఈ నెల 25వ తేదీ నుంచి 50 శాతం వసూలు చేయనున్నారు. దీంతో వనామీ ధరలు మరింత పతనం కానున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

● ఆగస్టు నెలాఖరు నుంచి రెండో పంటకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమయంలో వారిపై సుంకాల పిడుగు పడింది. దీంతో రైతులు సాగు విషయంలో పునరాలోచనలో పడ్డారు. 50 శాతం టారీఫ్‌ వల్ల ధరలు మరింత తగ్గితే.. సాగుకు తాత్కాలిక విరామం ఇచ్చేందుకూ వెనుకాడేది లేదంటున్నారు.

సిండి‘కాటు’ నుంచి సుంకాల ‘వేటు’

వరకు మరోసారి రొయ్యకు కష్టకాలం

ఏడాది కాలంగా ఒడిదొడుకులు

రికార్డు స్థాయిలో

ధర ఉన్నప్పుడు సిండికేట్‌ దెబ్బ

రెండుసార్లు అమెరికా సుంకాల దాడి

విదేశాలకు వెళ్లేది

50 కౌంట్‌ లోపు మాత్రమే..

టారిఫ్‌ పేరిట

మొత్తం కౌంట్ల ధర కుదింపు

ప్రస్తుతం సాగు 20 శాతమే..

ఉమ్మడి తూర్పున

23 వేల ఎకరాల్లో ఆక్వా సాగు

కౌంట్‌ ఫిబ్రవరి మార్చి తొలిసారి సుంకాలు పది రోజుల రెండోసారి సుంకాలు

రకం తొలి వారంలో తొలి వారంలో ప్రకటించాక... క్రితం మార్కెట్‌ ప్రకటించాక

30 470 465 425 440 390

40 415 390 340 400 345

50 375 365 320 375 325

60 345 335 300 345 305

70 320 300 295 325 325

80 285 270 255 295 265

90 265 250 235 275 245

100 255 240 225 265 235

గత జనవరి నుంచి ఇప్పటి వరకు కౌంట్‌ ధరలు(రూ.ల్లో) ఇలా..1
1/2

గత జనవరి నుంచి ఇప్పటి వరకు కౌంట్‌ ధరలు(రూ.ల్లో) ఇలా..

గత జనవరి నుంచి ఇప్పటి వరకు కౌంట్‌ ధరలు(రూ.ల్లో) ఇలా..2
2/2

గత జనవరి నుంచి ఇప్పటి వరకు కౌంట్‌ ధరలు(రూ.ల్లో) ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement