
గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి
కలెక్టర్ మహేష్‌కుమార్
అమలాపురం రూరల్: పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంస్థ ఇంజినీర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న గృహాలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 41,366 గృహాలు మంజూరు కాగా, వీటిలో 19,796 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్టు వివరించారు. ఈ నెలాఖరు నాటికి 1,150 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అందరికీ ఇళ్లు పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో మూడు, పట్టణాల్లో రెండు సెంట్ల భూమిని కేటాయిస్తారన్నారు. హౌసింగ్ పీడీ నరసింహారావు, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
పాఠ్య ప్రణాళికలో ప్రతిబింబించాలి
కోనసీమ జిల్లాకు అనుకూలమైన స్థానిక అవసరాలు కూడా పాఠ్య ప్రణాళికలో ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ మహేష్‌కుమార్ అన్నారు. మానవ వనరుల వికసిత్ భారత్ శిక్షణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక వ్యవసాయ పద్ధతులు, పంటల పెంపకం వంటి అంశాలను పాఠశాలల్లో పరిచయం చేయడం, 8–10 తరగతుల విద్యార్థులకు ఎక్స్‌పోజర్ విజిట్స్ ద్వారా ఇతర ప్రాంతాల సంస్కృతుల పరిచయం కల్పించాలన్నారు. అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ జి.మమ్మి, డీఎంహెచ్‌వో డాక్టర్ దుర్గారావు దొర, సమగ్ర శిక్షా రాష్ట్ర పరిశీలకుడు అబ్దుల్ గని, డిప్యూటీ డీఈవోలు పి.రామలక్ష్మణమూర్తి, గుబ్బల సూర్యప్రకాశం తదితరులు పాల్గొన్నారు.
వర్జీనియా మరింత కుంగి
గోపాలపురం: అంతర్జాతీయంగా వర్జీనియా పొగా కు ధరలు రోజు రోజుకూ దిగిపోతుండటం, నాలుగు రోజుల్లో కిలోకు రూ.20 పడిపోవడంతో రైతులు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. బుధవారం స్థానిక పొగాకు వేలం కేంద్రానికి వచ్చిన 1376 బేళ్లకు 1207 బేళ్లు కొనుగోలు చేయడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కిలోకు రూ.351 పలికిన పొగాకు బధవారం రూ.331కు పడిపోవడం, మేలు రకం పొగాకు మాత్రమే కంపెనీలు కొనుగోలు చేస్తూ మిగి లిన గ్రేడ్‌ను పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వాదాలకుంట, వెదుళ్లకుంట గ్రామాల పొగాకు మేలు రకంగా భావిస్తుంటారు. దానికి కూడా సరైన ధర రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గరిష్ట ధర రూ.350, కనిష్ట ధర రూ.200, సరాసరి రూ.331.26 పలికింది. బు ధవారం సరాసరి ధర రూ.299.83 14 పొగాకు కంపెనీలు వేలంలో పాల్గొన్నట్లు వేలం నిర్వాహణాధికారి కేవల్ రామ్ మీనా తెలిపారు.

గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి