
స్వీటు శారీ
అమలాపురం టౌన్: తాంబూలాలు, పెళ్లిళ్ల కోసం స్వీట్ల తయారీ కొత్త పుంతలు తొక్కుతోంది. చీరలు, తాంబూలం, బంగారు ఆభరణాలు, కుంకుమ భరణి, అరటి పండ్లు అనేకం స్వీట్లతోనే తయారవున్నాయి. సహజత్వం ఉట్టిపడేలా శుభకార్యాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొత్తపేటలో బుధవారం జరిగిన వివాహ నిశ్చయ తాంబూలాల కోసం వధువు కుటుంబీకులు అచ్చం పట్టుచీర, బంగారు నగలు తలపించేలా స్వీట్లు తయారు చేయించారు. అమలాపురం గోఖలే సెంటర్‌లోని శ్రీవైష్ణవి స్వీట్స్ ప్రతినిధి కాతర సురేష్ తన ప్రతిభతో పట్టుచీర, బంగారు గాజులు, ఇతర నగల్లాగే స్వీట్లు తయారు చేశారు. వివిధ రకాల ఫలాల రూపంలోనూ స్వీట్లను పెళ్లి వేడుకకు పంపించారు.

స్వీటు శారీ