
పురుగుమందు తాగి కమ్యూనిస్టు నాయకుడి మృతి
అయినవిల్లి: మండలానికి చెందిన ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మచ్చా నాగయ్య పరుగుమందు తాగి మృతి చెందారు. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు నాగయ్య సోమవారం ముక్తేశ్వరంలోని ఎరువుల దుకాణంలో పురుగుమందు కొనుగోలు చేశారు. అనంతరం అయినవిల్లిలంకలోని తన కొబ్బరితోటలో ఆ మందు తాగేశారు. అయితే కడుపులో మంట భరించలేక రోడ్డు మీదకు వచ్చి ఆ విషయాన్ని స్థానిక యువకులకు తెలిపారు. వెంటనే అతడిని అంబులెన్స్‌లో అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. అమలాపురంలోని ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. పలువురు ప్రముఖులు ఆయన మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అనంతరం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. నాగయ్య బంధువుల ఫిర్యాదుపై అయినవిల్లి ఎస్సై శాస్త్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.