
రక్షా బంధనం వేళ.. వీడిన పాశాలు..
● శుభకార్యానికి వెళ్లివస్తూ ఒకరు..
చెల్లెలికి రాఖీ కట్టి వస్తూ మరొకరు..
● ఎదురెదురుగా వాహనాలు ఢీకొని ఘటన
● కుమారుడి మృతి వార్త విని
గుండెపోటుతో తండ్రి మృతి
గోపాలపురం: మండలం వెంకటాయపాలెంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడడం.. వారిలో ఒకరి మరణ వార్త విని అతడి తండ్రి గుండెపోటుకు గురై చనిపోవడంతో ఇటు గోపాలపురం మండలం వాదాలకుంట, తాళ్లపూడి మండల పెద్దేవం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గోపాలపురం మండలం వాదాలకుంట గ్రామానికి చెందిన మరపట్ల సువర్ణరాజు (56) తాళ్లపూడి మండలం చిడిపిలో బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. అలాగే తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన గుండేపల్లి మణిశంకర్ (30) దేవరపల్లి మండలం యాదవోలులో ఉన్న చెల్లి వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకు తిరిగి వస్తున్నాడు.
వారిద్దరు గోపాలపురం మండలం వెంకటాయపాలెం మలుపు వద్ద పరస్పరం ఢీకొనడంతో మణిశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న సువర్ణరాజును గోపాలపురం సీహెచ్‌సీకి తరలించగా అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. సువర్ణరాజు వెళ్లిన శుభకార్యానికి భార్య, కుమారుడు, కుమార్తె మిగిలిన బంధువులు వెళ్లారు. తిరిగి సువర్ణరాజు ఒక్కడే మోటార్ సైకిల్ వస్తూ ప్రమాదానికి గురయ్యాడు. వెనుక వస్తున్న భార్య కుమారుడు, కుమార్తె, బంధువులు సువర్ణరాజును ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

రక్షా బంధనం వేళ.. వీడిన పాశాలు..

రక్షా బంధనం వేళ.. వీడిన పాశాలు..