
గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘ కార్యవర్గం ఎన్నిక
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. సంఘ అధ్యక్షుడిగా జీవీఆర్‌ఎస్‌హెచ్‌కే వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎస్.రాజు, గౌరవ అధ్యక్షుడిగా సలాది సాయి సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడిగా రేపాక వెంకటరాము, ఉపాధ్యక్షుడిగా కె.కిశోర్, సంయుక్త కార్యదర్శిగా ములంపాక శ్రీనివాసరావు, కోశాధికారిగా జీవీవీఎన్ త్రినాథ్, ఉపాధ్యక్షుడిగా తనికెళ్ల శ్రీనివాస్, మహిళా ప్రతినిధిగా కె.సునీత, రాష్ట్ర ప్రతినిధిగా డొక్కా రాజు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు, ప్రధాన కార్యదర్శి నాదెండ్ల బాబి, ఆలీ, రంగారావు, పి.వేంకటేశ్వరరావు, పి.రామకృష్ణ, చార్లెస్, గ్రంథాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.