
ఉత్సాహంగా అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు
● 3 రోజుల పాటు నిర్వహణ
● తలపడుతున్న 180 జట్లు
తుని రూరల్: శ్రీప్రకాష్ విద్యా సంస్థల ఆవరణలో మూడు రోజులపాటు జరిగే ఆంధ్ర, తెలంగాణ అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యా యి. శనివారం ప్రారంభమైన ఈ పోటీల్లో అండర్ 14, 17, 19 విభాగాల్లో 180 జట్లకు చెందిన రెండు వేల మంది బాలురు, బాలికలు పాల్గొంటున్నట్టు శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయప్రకాష్ తెలిపారు. మొదటి రోజు జరిగిన మ్యాచ్‌లలో 24 జట్లు పాల్గొనగా 12 జట్లు విజేతలుగా నిలిచాయని ఆయన తెలిపారు. సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్.మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ, ఖోఖో ఫెడరేషన్ కార్యదర్శి సీహెచ్‌ఎల్‌ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.
మొదట రోజు విజేత జట్లు: అండర్–19 బాలికల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన సిస్టర్స్ నివేదిత స్కూల్, ఏలూరుకు చెందిన సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ఏలూరు, తిరుపతికి చెందిన వరిటాస్ సైనిక్ స్కూల్ జట్లు విజేతగా నిలిచాయి. అండర్–17 బాలికల విభాగంలో నాచారానికి చెందిన సుప్రభాత హైస్కూల్, బొమ్మార్సిపేటకు చెందిన శాంతినికేత్ విద్యాలయం, హైదరాబాద్‌కు చెందిన భారతీయ విద్యాభవన్ జట్లు గెలుపొందాయి. అండర్–19 బాలుర విభాగంలో తిరుపతికి చెందిన ఎకార్డ్ స్కూల్, అండర్–17 బాలురు విభాగంలో బొమ్మార్సిపేటకు చెందిన శాంతినికేతన్ విద్యాలయం, సిద్ధార్థ బోడుప్పల్‌కు చెందిన పబ్లిక్ స్కూల్ జట్లు గెలిపొందాయి. అండర్–14 విభాగంలో నర్సింగపాలేనికి చెందిన హీల్ స్కూల్, విజయవాడకు చెందిన శ్రీస్వామి నారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఫార్‌ూట్యన్ బటర్‌ఫ్లై స్కూల్ జట్లు గెలుపొందినట్టు నిర్వాహకులు తెలిపారు.