
పద్మం సిల్వర్ జ్యుయలరీ ప్రారంభం
అమలాపురం టౌన్: స్థానిక హైస్కూల్ రోడ్డులోని సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో శుక్రవారం పద్మం సిల్వర్ జ్యుయలరీ షాపు ప్రారంభమైంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, అదే సినిమాలో బుల్లిరాజుగా నటించిన రేవంత్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పద్మం సిల్వర్ జ్యుయలరీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని పలు ప్రదేశాల్లో తమ శాఖలు ఉన్నాయన్నారు. ఇప్పుడు అమలాపురంలో కొత్తగా శాఖను ప్రారంభించామన్నారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ రూ.లక్ష కొనుగోలుపై రూ.50 వేల సిల్వర్ నగలు, రూ.50 వేల కొనుగోలు చేస్తే రూ.25 వేల సిల్వర్ నగలు, రూ.25 వేల కొనుగోలుపై రూ.12,500 నగలు ఉచితంగా అందించడం అభినందనీయమని చెప్పారు.