పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మనస్తాపం

సాక్షి, ధర్మపురి: తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ధర్మపురి మండలంలోని జైనా గ్రామంలో చోటుచేసుకొంది. ఎస్సై కిరణ్‌కుమార్ వివరాల ప్రకారం.. జైనాకు చెందిన సట్టా వినీత(20)కి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు.
యువతి మాత్రం తనకు పెళ్లి వద్దని, చదువుకోవాలని ఉందని ఎంత చెప్పినా వారు వినలేదు. దీంతో మనస్తాపం చెంది, మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: (పెళ్లయిన తొమ్మిది నెలలకే...)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి