పెళ్లి ఇష్టం లేదని యువతి ఆత్మహత్య

సాక్షి,చొప్పదండి: లక్ష్మీపూర్‌కు చెందిన కల్లేపల్లి జ్యోతి(24) ఆత్మహత్య చేసుకున్నట్లు రామడుగు ఎస్సై తాండ్ర వివేక్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. జ్యోతికి ఆమె కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడే వివాహం చేసుకోవడం ఇష్టం లేని ఆమె మనస్తాపానికి గురైంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. మృతురాలి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.