
సాక్షి, యాదాద్రి భువనగిరి: వినాయకుడి నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకరస సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు గణేషుడిని చెరువులో నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందాడు. ప్రవీణ్ మృతదేహం వెలికి తీసేందుకు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చదవండి: ఉత్సాహంగా వినాయక నిమజ్జనం