ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ.. ఇంతలోనే షాకింగ్ ఘటన

జడ్చర్ల(మహబూబ్‌నగర్): ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ, పట్టాలు దాటబోయి రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వేపోలీసుల వివరాల ప్రకారం.. బాదేపల్లిలోని బక్కరావు కాంపౌండ్‌లో ఉండే వడ్డె వినయ్‌కుమార్ (19) ఐటీఐ చదువుతున్నాడు. ఉదయం జిమ్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్‌లో పాటలు వింటూ రైల్వేస్టేషన్ గేటు దగ్గర పట్టాలు దాటబోయాడు. ఆ సమయంలో అటుగా మహబూబ్‌నగర్ వైపు గూడ్స్ రైలు వెళ్తోంది. వినయ్ గమనించకుండా పట్టాలు దాటుతూ.. రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తల్లి కళమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెచ్‌సీ కృష్ణ తెలిపారు.
చదవండి: న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య