
విజయలక్ష్మి ఇంటి ముందు ధర్నా చేస్తున్న బాధితులు
సాక్షి, హస్తినాపురం: చిట్టీల పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి రెండు కోట్ల రూపాయలతో ఓ మహిళ ఉడాయించింది. దీంతో బాధితులు ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన మేరకు.. అనురాధ కాలనీకి చెందిన కోన విజయలక్ష్మి తన స్నేహితులు , బంధువుల దగ్గర దాదాపు రెండు కోట్లరూపాయల మేరకు వసూలు చేసింది. 20 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి పోవడంతో కంగారు చెందిన బాధితులు ఆదివారం విజయలక్ష్మీ ఇంటిముందు ధర్నాకు దిగారు.
విజయలక్ష్మిని తీసుకొచ్చేంతవరకు తాము ఇక్కడే ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటామని బాధిత మహిళలు తెలిపారు. దాదాపు 45 మంది వద్ద డబ్బు తీసుకుందని ఈనెల 21న నారాయణరెడ్డి, క్రిష్ణారెడ్డి, వెంకటరెడ్డిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయలక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
చదవండి: ఓయూ క్యాంపస్‌లో యూజర్ చార్జీలు.. ఇకపై నో ఫ్రీ వాకింగ్
చదవండి: ‘మేము పోలీసులం.. డబ్బులు ఇస్తే కేసు నుంచి తప్పిస్తాం’