సహజీవనం.. ప్రియుడితో కలిసి కన్నబిడ్డకు చిత్రహింసలు

Woman Torture Child With her Boyfriend in Tiruvottiyur - Sakshi

సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): చెన్నైలో కన్నబిడ్డకు వాతలుపెట్టి చిత్రహింసలకు గురి చేసిన తల్లిని ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై శా స్త్రినగర్‌కు చెందిన భాను (29) భర్త నుంచి విడిపోయి రెండున్న ఏళ్ల ఆడబిడ్డతో కలసి జీవిస్తోంది. ఈ క్రమంలో భానుకు అదే ప్రాంతానికి చెందిన జగన్‌జోష్‌తో వివాహేతర సంబంధం ఏర్పడి సహజీవనం చేస్తున్నారు. వారు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బిడ్డ అడ్డు వస్తుండంతో భాను బిడ్డను కొడుతూ వేధిస్తుండేది.

ఈ క్రమంలో 29వ తేదీన జగన్‌ జోష్‌ సిగరెట్‌తో బిడ్డ ముఖంపై కాల్చడంతో చిన్నారిస్పృ హ తప్పి పడిపోయింది. దీంతో భాను చిన్నారిని చెన్నై ఎగ్మోర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఈ సంగతి తెలుసుకున్న భాను తల్లి కన్నియమ్మల్‌ ఆస్పత్రికి వచ్చి చిన్నారిని చూసి దిగ్భ్రాంతి చెందింది. ముఖం, వీపుపై వాతలు ఉండడంతో ఈ విషయమై అడయార్‌ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయగా భాను, జగన్‌జోష్‌కు అడ్డుగా ఉందని బిడ్డను చిత్రహింసలు పెడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. పోలీసులు ఈ మేరకు వారిద్దరిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: (చితిలో దూకి.. దేవతగా మారి..) 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top