చితిలో దూకి.. దేవతగా మారి.. 

Dussehra Celebrations Jayapuram Mapendrani Devi Highlights - Sakshi

జయపురం: దసరా ఉత్సవాల్లో జయపురం మా పెండ్రాని దేవికి ప్రముఖ స్థానం ఉంది. నవరంగపూర్‌ జిల్లా ఉమ్మర్‌కోట్‌ ప్రాంతంలో పెండ్రాహండి ఓ కుగ్రామం. 400 ఏళ్ల క్రితం ఓ ఆదివాసీ కుటుంబంలో జన్మించిన పెండ్రానికి వివాహమైన తరువాత ఆమె తల్లిదండ్రుల ఆహ్వానం మేరకు భర్త పెండ్రా ఇల్లరికం వచ్చారు. ఇరువురినీ వారు ఎంతో ఆదరంగా చూసేవారు.

అయితే పెండ్రాని నలుగురు అన్నదమ్ములకు ఈ విషయం గిట్టలేదు. దీంతో అతను పొలానికి వెళ్లిన సమయంలో పథకం ప్రకారం హతమార్చి, పాతి పెట్టారు. ఎంతటికీ భర్త ఇంటికి రాకపోవడంతో అనుమానించిన పెండ్రాని.. అతన్ని వెతుక్కుంటూ వెళ్లింది. తన సోదరులే భర్తను చంపి, పొలం వద్ద పాతి పెట్టారని గ్రహించి, సమీపంలోని చితిలో పడి మరణించింది. అనంతరం ఆమె ఆత్మ దేవతగా మారి గ్రామాల్లో సంచరిస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ప్రజలను కాపాడుతుంది. దీంతో తమను రక్షిస్తున్న దేవతగా విశ్వసించిన ఆదివాసీ ప్రజలు.. అక్కడే ఆమెకు గుడికట్టి, పూజించడం ప్రారంభించారు.

చదవండి: (Padampur MLA: పద్మపూర్‌ ఎమ్మెల్యే మృతి)

అమ్మవారి మహత్యం తెలుసుకున్ను జయపురం మహారాజులు.. దసరా ఉత్సవాలకు ఆమె లాఠీలను ఆహ్వానిస్తూ వచ్చారు. గత 4 దశాబ్దాలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నవరంగపూర్‌ జిల్లా ఉమ్మరకోట్‌ నుంచి ఆదివారం రాత్రి పెండ్రాని దేవి లాఠీలు జయపురం చేరాయి. ఎంతో మహిమ గల అమ్మవారు తమ కోర్కెలు తీర్చుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యలో పెండ్రాని దేవికి కోళ్లు, మేకలు, గొర్రెలు బలులు సమర్పిస్తారు. 

చదవండి: (దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. స్టేజ్‌పైనే కుప్పకూలిన ప్రముఖ గాయకుడు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top