Vellore Woman Lost Life By Hanging In Tamil Nadu - Sakshi
Sakshi News home page

బిడ్డకు ఉరివేసి తల్లి ఆత్మహత్య

Aug 1 2021 6:50 AM | Updated on Aug 1 2021 11:12 AM

Woman Lost Life By Hanging In Veluru Tamil Nadu  - Sakshi

తల్లి వెన్నిల(ఫైల్‌) , కూతురు హరిత(ఫైల్‌)

వేలూరు: భర్త మద్యానికి బానిసై తరచూ గొడవ పడుతుండడంతో మనస్తాపానికి గురైన భార్య కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన రాణిపేట జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. కావేరిపాక్యం సమీపంలోని సిత్తంజి గ్రామానికి చెందిన దయాలన్‌కు భార్య వెన్నిల(35), కుమార్తెలు కీర్తి, హరిత(3) ఉన్నారు. కూలి పనులు చేసే దయాలన్‌ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు.

శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అతను మరోసారి భార్యతో గొడవపడ్డాడు. తీవ్ర మనస్తాపానికి గురైన వెన్నిల ఓ కుమార్తెను తీసుకుని ఇంటి వెనుక వైపు వచ్చింది. చీరతో హరితకు ఉరివేసి అదే చీరతో ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం తల్లీకుమార్తెలు చెట్టుకు వేలాడుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అవ్యలూరు పోలీసులు మృతదేహాలను వాలాజ ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement