మహిళా ఐఏఎఫ్‌పై లైంగిక దాడి | Sakshi
Sakshi News home page

మహిళా ఐఏఎఫ్‌పై లైంగిక దాడి

Published Fri, Oct 1 2021 5:53 AM

Woman Indian Air Force officer molestation - Sakshi

న్యూఢిల్లీ/చెన్నై: తనపై లైంగిక దాడి జరిగిందని ఐఏఎఫ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదంటూ ఓ మహిళా ఐఏఎఫ్‌ అధికారి కోయంబత్తూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని 26న మహిళా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ అమితేశ్‌ హార్ముఖ్‌ తన వద్ద శిక్షణ తీసుకుంటున్న  ఐఏఎఫ్‌ మహిళా అధికారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఐఏఎఫ్‌ అధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, వారు ఆమె చెప్పిన విషయాన్ని పెడచెవిన పెట్టారు. సుప్రీంకోర్టు కొన్నేళ్ల క్రితం నిషేధం విధించిన ‘టూ ఫింగర్‌ టెస్ట్‌’నూ ఆమెపై నిర్వహించారు. అయితే, తాజాగా స్థానిక కోర్టు ఆదేశాల తర్వాత ఆ కేసు తమకు బదిలీ అయ్యిందని, కోర్ట్‌ మార్షల్‌ నిర్వహిస్తామని ఐఏఎఫ్‌ తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement