వివాహేతర సంబంధం.. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు.. పక్కా ప్లాన్‌తో

Wife Murder Her Husband With Extramarital Affair In Rangareddy - Sakshi

సాక్షి, పూడూరు (రంగారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను చంపేసింది. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎరుకల వెంకటయ్య(30), మాధవి(26) దంపతులు. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన శేఖర్, మాధవి వివాహేతర సంబంధం నెరుపుతున్నారు.

చదవండి: (మద్యం కోసం మర్డర్లు.. 17 రోజుల వ్యవధిలో మూడు హత్యలు...​​​​)

ఈవిషయమై వెంకటయ్య పలుమార్లు భార్య మాధవిని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగానే అడ్డు తొలగించుకోవాలని మాధవి, శేఖర్‌ పథకం పన్నారు. ఈక్రమంలో మాధవి ప్రియుడితో కలిసి గురువారం రాత్రి గ్రామానికి సమీపంలో ఉన్న ఓ వ్యక్తి పత్తి పంటలో వెంకటయ్యను చంపేశారు. వెంకటయ్య కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు.  

చదవండి: (టిక్‌టాక్‌ భార్గవ్‌కు మళ్లీ రిమాండ్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top