టిక్‌టాక్‌ భార్గవ్‌కు మళ్లీ రిమాండ్‌

Tiktok Bhargav Remanded Again Pocso Special Court - Sakshi

సాక్షి, విశాఖపట్నం: టిక్‌టాక్‌ (ఫన్‌ బకెట్‌) భార్గవ్‌కు మళ్లీ రిమాండ్‌ విధించారు. ఈ నెల 11 వరకు రిమాండ్‌ విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. ఆరు నెలల క్రితం పెందుర్తి వేపగుంట సింహపురికాలనీకి చెందిన 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడని టిక్‌టాక్‌ భార్గవ్‌ను దిశ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌ విధించారు. అయితే ఆయన నిబంధనలతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యాడు.

అయితే మళ్లీ సోషల్‌ మీడియాలో కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ పోస్టుల పెట్టడం, అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దిశ పోలీసులు నిందితుడ్ని తిరిగి అరెస్ట్‌చేసి న్యాయస్థానంలో శుక్రవారం హాజరుపరిచారు. నింధితుడికి ఈనెల 11వరకు రిమాండ్‌ విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం కేజీహెచ్‌లో వైద్యలు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు దిశ పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ వెల్లడించారు.   

చదవండి: (మద్యం కోసం మర్డర్లు.. 17 రోజుల వ్యవధిలో మూడు హత్యలు..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top