విషాదం: కవల పిల్లల అనుమానాస్పద మృతి.. | Twins Assasinate Tragedy In Nellore | Sakshi
Sakshi News home page

విషాదం: కవల పిల్లల అనుమానాస్పద మృతి..

Jun 21 2021 2:12 PM | Updated on Jun 21 2021 2:45 PM

Twins Assasinate Tragedy In Nellore - Sakshi

నెల్లూరు: మనుబోలు మండలం రాజోలు గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పది నెలల వయస్సు కలిగిన ఇద్దరు కవల పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది. అయితే, నిన్న సాయంత్రం పాలు (తల్లిపాలు కాదు) తాగిన వెంటనే కవల పిల్లలిద్దరు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటీన నెల్లూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

అయితే, దంపతుల మధ్య గతకొన్ని రోజులుగా తీవ్ర మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పిల్లల మృతిపై వీరి పాత్ర ఉందేమోనన్న అనుమానంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు , దంపతులిద్దరిని అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో మరిన్ని విషయాలు రాబడతామని పేర్కొన్నారు.

చదవండి: బంజారాహిల్స్‌: మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. భర్త కొట్టడంతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement