పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా ఐదుగురిని చంపేశాడు!

Tripura man kills 5 including minor daughters, Police Inspector - Sakshi

అగర్తలా: మానసికంగా కుంగుబాటుకు గురైన ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లు, సోదరుడు, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా ఐదుగురిని ఇనుప రాడ్‌తో కొట్టి చంపాడు. ఈ ఘటన త్రిపురలోని ఖొవాయ్‌ జిల్లాలో శనివారం జరిగింది. ష్యురాటలీ గ్రామానికి చెందిన ప్రదీప్‌ దేవ్‌రాయ్‌ శనివారం ఉదయం అకస్మాత్తుగా తన ఇంట్లోనే భార్య, ఇద్దరు కూతుళ్లతోపాటు సోదరుడిని ఐరన్‌ రాడ్‌తో తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. ఘటనలో కూతుళ్లు, సోదరుడు మరణించారు. తర్వాత అటుగా వెళ్తున్న ఆటోను అడ్డగించి, డ్రైవర్, అతడి కుమారుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ చనిపోయాడు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ సత్యజిత్‌ మల్లిక్‌ నేతృత్వంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ప్రదీప్‌ను నిలువరించేందుకు యత్నించారు. కానీ, తెలియని ఆవేశంతో ఉన్న ప్రదీప్‌.. ఇన్‌స్పెక్టర్‌ సత్యజిత్‌పై కూడా ఇనుప రాడ్‌తో దాడి చేయగా, తీవ్ర గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top