టోలీచౌకీ వాసి దారుణ హత్య | toli chowki resident shaik salman murdered in moinabad mandal nakkalapalli sorroundings | Sakshi
Sakshi News home page

తలపై రాయితో కొట్టి చంపిన దుండగులు

Jan 31 2021 6:14 PM | Updated on Jan 31 2021 6:35 PM

toli chowki resident shaik salman murdered in moinabad mandal nakkalapalli sorroundings - Sakshi

సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు హైదరాబాద్‌ నగరంలో టోలీచౌకీకి చెందిన షేక్ సల్మాన్‌గా పోలీసులు గుర్తించారు. వైరుతో గొంతు బిగించి, తలపై రాయితో కొట్టి చంపిన ఆనవాలు కనిపిస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీం సహకారంతో వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, షేక్‌ సల్మాన్‌ను తానే హతమార్చానని ఓ వ్యక్తి రాయదుర్గం పోలీసులకు లొంగిపోయాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement