చేపల వేటకు వెళ్లి ముగ్గురు సోదరుల మృతి | Three brothers died while going fishing | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి ముగ్గురు సోదరుల మృతి

Aug 28 2024 4:45 AM | Updated on Aug 28 2024 4:45 AM

Three brothers died while going fishing

ఒకరిని రక్షించబోయి.. మరో ఇద్దరు 

ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి  

ఆదిలాబాద్‌ జిల్లాలో ఘటన 

ఆదిలాబాద్‌ రూరల్‌: వాగులో చేపల వేటకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా ఆదిలాబాద్‌రూరల్‌ మండలం పొచ్చర గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నా యి. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన నాగుల్వార్‌ విజయ్‌(28), నాగుల్వార్‌ ఆకాశ్‌(26), నాగుల్వార్‌ అక్షయ్‌(22) ముగ్గురు అన్నదమ్ములు. 

తాంసి మండలంలోని బండల్‌నాగాపూర్‌లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ముగ్గురూ పొచ్చర గ్రామ సమీపంలోని వాగు వద్దకు చేపల వేటకు ఉదయం వెళ్లారు. చేపలు పడుతున్న క్రమంలో అక్షయ్‌ ప్రమాదవశాత్తు కాలుజారి వాగులో పడిపోగా...అతడిని రక్షించేందుకు ఇద్దరన్నదమ్ములూ వాగులోకి దూకేశారు. అయితే వీరికి కూడా ఈత రాకపోవడంతో ముగ్గురు వాగులో కొట్టుకుపోయారు. 

వీరితో పాటే అక్కడికి వెళ్లిన వీరి సమీప బంధువు కాంబ్లే శ్రీనివాస్‌ గ్రామస్తులకు, పోలీసులకు సమాచారమివ్వగా వారు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఈ ముగ్గురూ వాగులో కొట్టుకుపోయారు. దీంతో గజ ఈతగాళ్లను రప్పించి వీరి కోసం గాలించగా...ముందుగా విజయ్‌ తర్వాత ఆకాశ్, అక్షయ్‌ మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement