నిశ్చితార్థం రోజునే విద్యుత్‌ స్తంభంపై శవమై 

Telangana: Young Man Died Under Current Pole In Sanga Reddy District - Sakshi

దానంపల్లి శివారులో యువకుడి అనుమానాస్పద మృతి  

జోగిపేట(అందోల్‌): నిశ్చితార్థం జరగాల్సిన రోజునే ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆదివారం ఉదయం విధులకు వెళ్లిన ఆ యువకుడు డ్యూటీ ముగించుకుని ఇంటికెళ్లాల్సిన వ్యక్తి విద్యుత్‌ స్తంభంపై నిర్జీవంగా వేలాడుతూ కన్పించాడు. సంగారెడ్డి జిల్లా అందోలు మండలం దానంపల్లి శివారులో సోమవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ గ్రామానికి చెందిన బాలరాజు (25) పాల్వంచలోని సోలార్‌ కేంద్రంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఆదివారం యథావిధిగా విధులకు హాజరైన బాలరాజు సోమవారం దానంపల్లి గ్రామ సమీపంలోని శివారులో విద్యుత్‌ స్తంభానికి వేలాడుతూ కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి వివరాలు తెలియక పోవడంతో పోలీసులు వాట్సాప్‌ గ్రూపుల్లో ఫొటోలు పెట్టడంతో బాలరాజు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో జోగిపేట పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న కుటుంబ సభ్యులు బాలరాజు మృతిపై తమకు అనుమానాలు న్నాయని, కంపెనీలో పనిచేసే వారే చంపి ఉంటారని మృతుడి సోదరుడు పొట్టి శంకరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాలరాజుకు కరెంట్‌ స్తంభాలు ఎక్కడం కూడా రాదని కుటుంబ సభ్యులు అంటు న్నారు. డ్రైవింగ్‌ పనులే చేస్తాడని చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సామ్యా నాయక్‌ తెలిపారు. కాగా, బాల రాజుకు ఇటీవలే పాపన్నపేట మం డలానికి చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదిరింది. సోమవారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top