టీఆర్‌ఎస్‌ కార్యకర్తల టాటా ఏస్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురి పరిస్థితి విషమం | TATA Ace Vehicle Accident In Karimnagar | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ కార్యకర్తల టాటా ఏస్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురి పరిస్థితి విషమం

Oct 26 2021 4:20 PM | Updated on Oct 26 2021 6:53 PM

TATA Ace Vehicle Accident In Karimnagar - Sakshi

కరీంనగర్‌: హుజురాబాద్‌ మండలం రాజపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుజారాబాద్‌లో ఎన్నికల ప్రచారం కోసం తరలిస్తున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తల టాటా ఏస్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. టాటా ఏస్‌లో మొత్తంగా..  20 మంది మహిళలు ఉన్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే.. ట్రాలీలో ఉన్నమహిళలు రోడ్డుపై ఎగిరి పడ్డారు. ఆ ప్రదేశమంతా క్షత గాత్రుల ఆర్తనాదాలతో మిన్నంటిపోయింది.

వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో .. వారికి మెరుగైన చికిత్సకోసం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని హుజురాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుపై ఒకవైపు పూర్తిగా ధాన్యం రాసులు కుప్పగా పోయడం వలన ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement