అధికారుల చేతివాటం.. ఓ మహిళా రైతు రూపంలో.. 

Tamil Nadu Officials Crop Loan Fraud - Sakshi

చెన్నై : పంట రుణమాఫీలో సహకార సంఘాల్లోని సిబ్బంది మాయాజాలం ప్రదర్శించి ఉండడం వెలుగుచూసింది. రశీదు కోసం వచ్చే రైతుల వద్ద లంచం పుచ్చుకోవడమే కాదు, మాయాజాలం రూపంలో రూ. 25 లక్షల మేరకు మోసాలకు పాల్పడినట్టుగా విజిలెన్స్‌ విచారణలో తేలింది. సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ సీఎం పళనిస్వామి ప్రకటించడమే కాదు, తక్షణంలో అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. రుణాల మాఫీకి సంబంధించిన రశీదులను రైతులకు అందించే పనిలో సాగుతోంది.

అయితే సహకార సంఘాలు, బ్యాంకుల్లో పనిచేస్తున్న కొందరు సిబ్బంది మాయాజాలం, అవినీతి రూపంలో రుణమాఫీపై విమర్శలు బయలుదేరాయి. రశీదుల కోసం వచ్చే రైతుల వద్ద లంచం కోరడం, అధిక మొత్తంలో రుణాల్ని మాఫీ చేయాల్సి ఉంటే, అందులో మాయాజాలం ద్వారా లక్షలు దండుకునే పనిలో కొందరు సిబ్బంది ఉండడం వెలుగులోకి వచ్చింది.  

ఈ మాయాజాలం వ్యవహారంలో ఓ మహిళా రైతు రూపంలో వెలుగులోకి వచ్చింది. తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపంలోని తీర్చుర్‌ సహకార బ్యాంక్‌లో రూ. 50 వేలు రుణమాఫీకి సంబంధించిన రశీదు కోసం మహిళా రైతు శ్రీదేవి ప్రయతి్నంచారు. అయితే, అక్కడి కార్యదర్శి అన్నాదురై చేతులు తడపాల్సిందేనని పట్టుబట్టారు. తనకు రూ.5 వేలు ఇస్తేనే, రశీదు అని స్పష్టం చేయడంతో ఆ మహిళా రైతు విజిలెన్స్‌ వర్గాల్ని ఆశ్రయించారు. పథకం ప్రకారం శుక్రవారం సాయంత్రం అన్నాదురైను పట్టుకునేందుకు విజిలెన్స్‌ వర్గాలు సిద్ధమయ్యాయి.

ఆయన ఆమె ఇచ్చిన డబ్బును చేతిలో తీసుకోకుండా, బల్లపై పెట్టి వెళ్లి పోవాలని సూచించడంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోలేని పరిస్థితి.  శనివారం సియామంగంలోని ఆ కార్యదర్శి ఇళ్లు, తీర్చుర్‌ కార్యాలయంలో సోదాల్లో నిమగ్నం కావడం గమనార్హం. ఒక్క తిరువణ్ణామలై జిల్లాలోనే రూ. 25 లక్షల మేరకు రుణమాఫీ పేరిట మాయ సాగినట్టు తేలడంతోనే విజిలెన్స్‌ విచారణ, సోదాలు ముమ్మరంగా సాగుతుండడం గమనార్హం. కోవైలో ఓ రైతు వద్ద లంచం పుచ్చుకుంటూ పొల్లాచ్చి మహాలింగపురం సహకార బ్యాంక్‌లో పనిచేస్తున్న సెల్వరాజ్, ఆర్ముగంలో విజిలెన్స్‌కు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడంతో సహకార సంఘాలు, బ్యాంక్‌లపై విజిలెన్స్‌ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top