Tamil Nadu: నిత్య పెళ్లికొడుకు అరెస్టు.. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని..

Tamil nadu man arrested over marrying four womans - Sakshi

సాక్షి, చెన్నై(అన్నానగర్‌): ఒకరికి తెలియకుండా మరొకరిని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలోని బోధికులం గ్రామానికి చెందిన సతీష్‌ (38) కట్టెల వ్యాపారి. అదే గ్రామానికి చెందిన రేఖను వివాహం చేసుకున్నాడు.

ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఆమె నుంచి విడిపోయి లతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత మురుగలక్ష్మితో పరిచయం ఏర్పడి ఆమెను వివాహమాడాడు. అరుప్పుకోటైలో ఆమెతో కలిసి నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో మేకలు మేపుతున్న 17 ఏళ్ల యువతితో సతీష్‌కి పరిచయం ఏర్పడింది. మాయమాటలు చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో తన కూతురు కనిపించడం లేదని బాలిక తండ్రి అరుప్పుకోటై తాలూకా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఉళుందూరుపేటలోని సోదరి ఇంట్లో ఉన్న బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను రక్షించి విరుదునగర్‌లోని ఆశ్రమంలో ఉంచారు. సతీష్‌ అరుప్పుకోటై సమీపంలోని పాలవనత్తం ప్రాంతంలో తలదాచుకున్నట్లు బుధవారం సమాచారం అందడంతో పోలీసులు పోక్సో చట్టం కింద సతీష్‌ను అరెస్టు చేశారు.  

చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. భర్త పలుమార్లు హెచ్చరించినా..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top