Krishna District: మహిళా వైద్యురాలి అనుమానాస్పద మృతి | Suspicious Demise Of Female Doctor In Krishna District | Sakshi
Sakshi News home page

Krishna District: మహిళా వైద్యురాలి అనుమానాస్పద మృతి

Aug 15 2021 4:27 AM | Updated on Aug 15 2021 4:27 AM

Suspicious Demise Of Female Doctor In Krishna District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వత్సవాయి: మహిళా వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. మండల కేంద్రం వత్సవాయిలో సంవత్సరం కిందట ఒక ప్రైవేటు ఆస్పత్రిని ప్రారంభించారు. అందులో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన భీమనాథం మౌనికారెడ్డి(28) వైద్యురాలిగా పనిచేస్తున్నారు.


మృతిచెందిన వైద్యురాలు మౌనికారెడ్డి

రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా విధులు నిర్వహించిన ఆమె అదే రోజు రాత్రి ఆమె ఉంటున్న గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ ఉండటాన్ని కిటికీలోంచి సిబ్బంది గమనించారు. వెంటనే రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. వీఆర్వో శివాజీ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మహాలక్ష్ముడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement