ఓ దొంగోడు.. పోలీసులు.. సినిమాను తలపించే సీన్‌!

Stolen Range Rover Car Flee On Railway Tracks Video Went Viral - Sakshi

మనం నిత్యం ఎన్నో దొంగతనాల గురించి చదువుతూనే ఉన్నాం. కొందరు పొట్టకూటి కోసం దొంగలుగా.. మారితే మరికొందరు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి తప్పుదోవ పడతారు. అయితే కొన్ని దొంగతనాలు సినిమాలను మించి జరుగుతుంటాయి.  

తాజాగా బ్రిటన్‌లో ఓ కారు దొంగతనం సీన్‌ సినిమాను తలపించే విధంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. యూకే రైల్వే స్టేషన్‌లో ఓ దొంగ  ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారును దొంగిలించడానికి పథకం వేశాడు. ఇది గుర్తించిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిని తోసేసి కారును రైలు పట్టాలపై పరుగు పెట్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి.

కాగా, కారును పట్టాలపై కొంత దూరం పరుగు పెట్టించిన దొంగ అక్కడే వదిలేసి పారిపోయాడు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘ఈ సీన్‌ గ్రాండ్ తెఫ్ట్ ఆటో (జిటిఏ) గేమ్‌ను గుర్తు చేసింది.’’ అంటూ కామెంట్‌ చేశాడు. మరో నెటిజన్‌ ‘‘ ఈ సీన్‌ కంప్యూటర్‌ గేమ్‌లను తలదన్నేలా ఉంది.’’ అంటూ రాసుకొచ్చాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top