కూతురు ప్రేమపెళ్లి.. ఇటుకలపల్లిలో సర్పంచ్‌ వీరంగం..

Sarpanch Ravinder Who Burnt Houses For Loving His Daughter - Sakshi

సాక్షి, వరంగల్‌ జిల్లా: నర్సంపేట మండలం ఇటికాలపల్లి  సర్పంచ్ మండల రవీందర్ వీరంగం సృష్టించారు. కూతురు కావ్యశ్రీ అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్‌ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం ఇష్టంలేని అమ్మాయి తండ్రి సర్పంచ్ ఆగ్రహంతో తన బిడ్డను పెళ్ళి చేసుకున్న యువకుడి ఇంటితో పాటు వారి సహకరించిన ఇద్దరు స్నేహితుల ఇళ్లపై దాడి చేయించాడు. నిప్పంటించడంతో పర్నిచర్ దగ్ధమయ్యింది.

ప్రేమజంట హసన్‌పర్తి పరిధిలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ప్రేమపెళ్లి అనంతరం సర్పంచ్ హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. కావ్యను తనతో రమ్మని తండ్రి ఎంత బతిమలాడిన రాకపోవడంతో ఆగ్రహంతో స్వగ్రామానికి వెళ్లి రంజిత్ ఇంటితో పాటు అతనికి సహకరించిన ఇద్దరు మిత్రుల ఇళ్లను దగ్ధం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో పోలీసులు గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.
చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. పోలీసులే షాకయ్యారు! 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top