బీజేపీ నేత ఇంట్లో భారీ చోరి

Robbery At Haryana BJP Leader Sonali Phogat House - Sakshi

బీజేపీ నేత సొనాలీ ఫోగాట్‌ ఇంట్లో భారీ చోరి

చండీగఢ్‌, హిసార్‌‌: హరియాణాకు చెందిన బీజేపీ నేత, టిక్‌టాక్‌ స్టార్‌ సొనాలీ ఫోగాట్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బంగారు ఆభరణాలు, లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌, 10లక్షల రూపాయల నగదుతో పాటు విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు పోలీసులు వెల్లడించారు. వివరాలు.. ఈ నెల 9న సొనాలీ ఇంటికి తాళం వేసి చండీగఢ్‌ వెళ్లారు. తిరిగి 15వ తారీఖున ఇంటికి వచ్చారు. ఆమె వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఆందోళనతో ఇంట్లోకి వెళ్లి చూడగా... బంగారం, వెండి ఆభరణాలు, లైసెన్స్‌డ్‌ తుపాకీతో పాటు 10 లక్షల రూపాయల నగదు కూడా చోరీకి గురయినట్లు తెలిసింది. దాంతో దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సొనాలీ.  

సొనాలీ ఇంటి వద్ద సీసీకెమరాలు ఉండటంతో తమ గురించి వీటిలో రికార్డు అయి ఉంటుందని భావించిన దొంగలు.. తమతో పాటు డిజిటల్‌ వీడియో రికార్డర్‌ (డీవీఆర్‌)లో ఉన్న ఫుటేజీని కూడా తీసుకుపోయారని పోలీసులు తెలిపారు. సొనాలీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌టీఎం స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సుఖ్‌జిత్‌ చెప్పారు.  2019లో జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అదంపూర్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన సొనాలీ ఫోగాట్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయిన సంగతి తెలిసిందే.

చదవండి: డేటింగ్‌ యాప్‌తో వల, డ్రగ్స్‌ ఇచ్చి 16మందిని

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top