నవమి వేడుకల్లో ఘర్షణలు

Ram Navami violence: 1 dead, 12 injured in Jharkhand - Sakshi

గుజరాత్, జార్ఖండ్‌ల్లో ఇద్దరు మృతి

భువనేశ్వర్‌/అహ్మదాబాద్‌/రాంచీ: దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన శ్రీరామనవమి వేడుకల సమయంలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జార్ఖండ్‌లోని లోహర్‌దాగాలో జరిగిన ఘర్షణల్లో ఒకరు చనిపోగా 12 మంది గాయపడ్డారు. గుజరాత్‌ రాష్ట్రం ఆనంద్‌ జిల్లా ఖంభట్‌లో జరిగిన గొడవల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో అల్లర్లు చెలరేగాయి. నగరంలో కర్ఫ్యూ విధించి, 80 మందిని అరెస్ట్‌ చేశారు.

రామనవమి ఊరేగింపుపై రాళ్లు విసిరిన దుండగులకు చెందినవిగా గుర్తించిన 50 వరకు అక్రమంగా నిర్మించిన నివాసాలు, దుకాణాల కూల్చివేత ప్రారంభించినట్లు అధికారులు తెలిపా రు. వదంతులకు కారణమైన నలుగురు ప్రభుత్వాధికారులపై చర్యలుంటాయన్నారు. అల్లర్ల సందర్భంగా ఖర్గోన్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ సిద్ధార్థ చౌధరికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. దీంతోపాటు మరో ఆరుగురు పోలీసులు సహా 24 మంది గాయపడ్డారు. దోషులను గుర్తించి వారి ఆస్తులను స్వా ధీనం చేసుకుంటామని సీఎం శివరాజ్‌ తెలిపారు. జార్ఖండ్‌లోని లోహర్‌దాగా జిల్లా హిర్హి గ్రామంలో నవమి ఊరేగింపుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. రెండు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో ఒకరు చనిపోగా 12 మంది గాయపడ్డారు.

మసీదుపై కాషాయ జెండా
బిహార్‌ రాష్ట్రం ముజఫర్‌పూర్‌ జిల్లా మొహమ్మద్‌పూర్‌ ఆదివారం ఒక వ్యక్తి మసీదు ప్రవేశద్వారంపై కా షాయ రంగు జెండా ఎగుర వేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఇది చూస్తూ కత్తులు, హాకీ స్టిక్కులు పట్టుకుని బైక్‌లపై వచ్చిన వ్యక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా వీడియోలో ఉంది. విద్వేషం, హింస దేశాన్ని బలహీనపరుస్తాయని, ప్రజలంతా సోదరభావంతో ఐకమత్యంతో మెలగాలని రాహుల్‌ గాంధీ కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top