ఎరక్కపోయి ఇరుక్కున్నారుగా!.. సినిమాను తలపించే సీన్‌ | Punjab Police And Criminals Come Face To Face Then Begins Chase | Sakshi
Sakshi News home page

పోలీసులకు ఎదురుపడిన క్రిమినల్స్‌.. సినిమాను తలపించిన సీన్‌..!

Published Thu, Dec 1 2022 7:34 PM | Last Updated on Thu, Dec 1 2022 7:34 PM

Punjab Police And Criminals Come Face To Face Then Begins Chase - Sakshi

చండీగఢ్‌: ఆయుధాలతో హల్‌చల్‌ చేస్తున్న క్రిమినల్స్‌కు పోలీసులు ఎదురుపడ్డారు. ఇరువురి ఎస్‌యూవీ వాహనాలు ఎదురుపడటంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. పోలీసులను గమనించిన క్రిమినల్స్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్‌ చేశారు.ఈ సంఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ సంఘటనలో క్రిమినల్‌ రికార్డ్‌ ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

క్రిమినల్స్‌ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు బయలుదేరారు. అమృత్‌సర్‌లోని ఓ మార్కెట్‌లోని ఇరుకు రోడ్డులో ఇరువురి వాహనాలు ఎదురుపడ్డాయి. పోలీసులను గమనించిన వెనుక సీటులోని వ్యక్తి ముందుగా దిగి పరారయ్యాడు. ఆ తర్వాత డ్రైవర్‌ సైతం పరుగులు పెట్టాడు. వారిని పట్టుకునేందుకు సుమారు ఆరుగురు పోలీసులు ఛేజ్‌ చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత ఓ అధికారి తిరిగి వచ్చి వాహనంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అని తనిఖీ చేశారు. 

ఛేజింగ్‌ తర్వాత వివరాలు వెల్లడించారు పోలీసులు. ఇద్దరు క్రిమినల్స్‌ రవి, రాబిన్‌లను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. ‘ఇరువురిపై 5-6 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వారి నుంచి 5 ఆయుధాలు, లైవ్‌ క్యాట్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నాం. తదుపరి విచారణ చేపట్టాం.’ అని అమృత్‌సర్‌ పోలీసు కమిషనర్‌ జస్కరన్‌ సింగ్‌ తెలిపారు.

ఇదీ చదవండి: ‘భారత్‌ జోడో యాత్రతో చచ్చిపోతున్నాం’.. కమల్‌నాథ్‌ వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement