భార్యను కాల్‌ గర్ల్‌గా మార్చిన భర్త రేవంత్‌ | Police Arrested TTD Employee Revanth Who Tortured Wife For Extra Dowry | Sakshi
Sakshi News home page

భార్యను కాల్‌ గర్ల్‌గా మార్చిన భర్త రేవంత్‌

Dec 31 2020 11:25 AM | Updated on Dec 31 2020 6:16 PM

Police Arrested TTD Employee Revanth Who Tortured Wife For Extra Dowry - Sakshi

సాక్షి, తిరుపతి: భార్యను కాల్‌ గర్ల్‌గా మార్చిన శాడిస్టు భర్త రేవంత్‌ను అరెస్టు చేసిన అలిపిరి పోలీసులు మరికాసేపట్లో మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా దిశ పీఎస్‌ డీఎస్పీ రామరాజు మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీకి చెందిన ఓ కాలేజీలో జూనియర్ అసిస్టెంటుగా పని చేస్తున్న రేవంత్ నాలుగు నెలల క్రితం నిరోషాను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వివాహం అనంతరం ఆదనపు కట్నం తేవాలంటూ ఆమెను వేధించడం మొదలు పెట్టాడని చెప్పారు. ఈ క్రమంలో ఆమెను మానసికంగా హింసించడంతో నిరోషా గతంలో అలిపిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని చెప్పారు. దీంతో ఎస్‌ఐ హిమబిందు ఇద్దరికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారన్నారు.

అయినప్పటికి రేవంత్‌ ఆమెను మరింత వేధింపులకు గురిచేయడమే కాక వారిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడన్నారు. అంతేగాక ఆమె న్యూడ్‌ ఫొటోలను పోస్టు చేసి గంటకు రూ. 3వేలు అంటూ భార్యను కాల్‌ గర్ల్‌గా చిత్రీకరించాడని తెలిపారు. అది తెలిసిన  నిరోషా మరోసారి అలిపిరి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు రేవంత్‌పై ఐపీసీ సెక్షన్‌ 307, 313, 354(డీ), 324, 506, 66(ఈ) కింద కేసు నమోదు చేసి రేవంత్‌ను అరెస్టు చేశామన్నారు. అయితే మొదటి సారి నిరోషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయని ఎస్‌ఐపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement