ప్రేమ విఫలంతోనే యువకుడి బలవన్మరణం

Panipuri Seller Suicide In SPSR Nellore - Sakshi

సాక్షి, నాయుడుపేట టౌన్‌: పట్టణంలోని అమరాగార్డెన్‌ వీధిలో నివాసం ఉంటూ పానీపూరి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం హమీర్‌పూర్‌ జిల్లాకు చెందిన యువకుడు సర్వేష్‌కుమార్‌ ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రేమ విఫలమవడంతోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. గత కొంత కాలంగా యువకుడు మధ్యప్రదేశ్‌ రాష్ట్రం గ్వాలియర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ యువతితో మనస్పర్థలతో రావడంతో సర్వేష్‌ కుమార్‌ దిగాలుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం కుటుంబ సభ్యులకు సైతం ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పగా వారు నమ్మలేదు. దీంతో నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్నాడని సోదరుడు సోముకుమార్‌తో పాటు బంధువులు అవేదన చెందారు. పోలీసులు సర్వేష్‌కుమార్‌ మృతదేహానికి పోస్టుమార్టం జరిపి సోమవారం సాయంత్రం అప్పగించారు. యువకుడి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్‌కు తీసుకెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో నాయుడుపేటలో ఉంటున్న బంధువులే దగ్గరుండి మృతుడి సోదరుడి చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులు వాట్సప్‌ ద్వారా కడ చూపులు చూసుకున్నారు.  

యవతి మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత
పట్టణంలోని గరిఢీ వీధిలో నివాసం ఉంటున్న  మైనార్‌ ప్రేమ విఫలం కావడంతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మైనర్‌ మృతదేహానికి పోలీసులు పోస్టమార్టం జరిపించి  కుటుంబ సభ్యులకు సోమవారం అప్పగించారు. వైద్యశాల వద్ద మృతురాలి కుటుంబ సభ్యుల రోదనలకు అంతులేకుండా పోయింది. (చదవండి: విచారణకు వస్తానని చెప్పి..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top