మోడల్‌ దారుణ హత్య: గొంతు కోసి.. నగ్నంగా మార్చి

Pakistani Model Nayab Nadeem Strangled to Death at Home - Sakshi

పాకిస్తాన్‌లో వెలుగు చూసిన దారుణం

లాహోర్‌ డిఫెన్స్‌ ఏరియా సమీపంలో చోటు చేసుకున్న ఘటన

సవతి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

Model Nayab Nadeem: పాకిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రఖ్యాత మోడల్‌ అనుమానాస్పద రీతిలో దారుణ హత్యకు గురైంది. ఆమె గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేసి.. నగ్న శరీరాన్ని ఇంట్లో పడేసి వెళ్లారు దుండగులు. సవతి సోదరుడి ఫిర్యాదుతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. 

పాకిస్తాన్‌ ప్రఖ్యాత మోడల్‌ నయాబ్‌ నదీమ్‌ ఆదివారం అనుమానాస్పద రీతిలో హత్య గావించబడ్డారు. లాహోర్‌లోని ఆమె నివాసంలో ఈ దారుణం చోటు చేసుకున్నట్లు పాకిస్తాన్‌ న్యూస్‌ పేపర్‌ డ్వాన్‌ వెల్లడించింది. నిందితులు ఆమె ఇంట్లోకి చొరబడి దారుణంగా హత్య చేశారని పేర్కొన్నది. నయాబ్‌ సవతి సోదరుడిచ్చిన ఫిర్యాదతో పోలీసులు కేసు నమోదు చేశారు. 29 ఏళ్ల నయాబ్‌ ఇంకా వివాహం చేసుకోలేదు. లాహోర్‌లోని డిఫెన్స్‌ ఏరియాలో ఆమె ఒంటరిగా నివాసం ఉంటున్నారు. 

ఈ సందర్భంగా నయాబ్‌ సవతి సోదరుడు నసీర్‌ మాట్లాడుతూ.. ‘‘శనివారం అర్థరాత్రి మేం ఐస్‌క్రీం తినడానికి బయటకు వెళ్లాం. ఆ తర్వాత నేను తనను ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లాను. ఇంటికి వెళ్లాక నాకు నయాబ్‌ కాల్‌ చేసింది. కానీ పడుకుని ఉండటంతో తన కాల్‌ లిఫ్ట్‌ చేయలేదు. ఆదివారం ఉదయం తిరిగి తనకు కాల్‌ చేశాను. లిఫ్ట్‌ చేయలేదు. దాంతో తనను చూడటానికి వచ్చిన నాకు భయానక దృశ్యం కనిపించింది’’ అని తెలిపాడు.

‘‘గొంతు దగ్గర గాయంతో.. రక్తం మడుగులో నగ్నంగా పడి ఉన్న నయాబ్‌ శరీరం కనిపించింది. ఆ దృశ్యం చూడగానే భయంతో బిగుసుకుపోయాను. ఆ తర్వాత తేరుకుని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాను. నయాబ్‌ బాత్రూం కిటికి పగిలిపోయి ఉంది. దుండగులు దాని గుండా ఇంట్లో చొరబడి తనను హత్య చేసి ఉంటారు. ఇక తన నగ్న శరీరాన్నీ టీవీ రూంలో పడేశారు’’ అని నసీర్‌ తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. 

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top