బంజారాహిల్స్‌: కన్న కూతురితో భిక్షాటన.. ఆపై వ్యభిచారం చేయాలని.. | Mother Held For Pushing Daughter Into Prostitution | Sakshi
Sakshi News home page

Banjara Hills: కన్న కూతురితో భిక్షాటన.. ఆపై వ్యభిచారం చేయాలని..

Dec 10 2021 2:00 PM | Updated on Dec 10 2021 3:24 PM

Mother Held For Pushing Daughter Into Prostitution - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తల్లి తన కూతురు(16)తో కొంత కాలంగా భిక్షాటన చేయిస్తున్నది. అమీర్‌పేట్‌లోని సాయిబాబా టెంపుల్‌ సమీపంలో 16 ఏళ్ల బాలిక..

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): కన్న కూతురితో భిక్షాటన చేయించడమే కాకుండా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న తల్లిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 2లోని ఇందిరానగర్‌లో నివసించే తల్లి తన కూతురు(16)తో కొంత కాలంగా భిక్షాటన చేయిస్తున్నది. 
(చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. ఎన్నిసార్లు చెప్పినా..)

అమీర్‌పేట్‌లోని సాయిబాబా టెంపుల్‌ సమీపంలో 16 ఏళ్ల బాలిక భిక్షాటన చేయిస్తున్నదని చైల్డ్‌లైన్‌ 1098కు సమాచారం ఇచ్చారు. చైల్డ్‌లైన్‌ కో–ఆర్డినేటర్‌ వేదాల సాల్మన్‌రాజు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా ఆమెకు కనిపించలేదు. ఈ నెల 6వ తేదీన ఖమ్మంలో కూడా 16 ఏళ్ల బాలిక భిక్షాటన చేస్తున్నట్లుగా 1098కు మరోసారి సమాచారం సంబంధిత సిబ్బంది అక్కడికి వెళ్లి ఆమెను రెస్క్యూ చేశారు.

విచారించగా తన తల్లి బలవంతంగా భిక్షాటనతో పాటు వ్యభిచారం కూడా చేయిస్తున్నదని బాలిక వెల్లడించింది. దీంతో పోలీసులు బాలికను పునరావాస కేంద్రానికి తరలించి తల్లిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.   
(చదవండి: ‘174 మంది బాలికలకు ఒకటే’.. సాక్షి కథనానికి విశేష స్పందన)

Advertisement
 
Advertisement
Advertisement