బాలికపై లైంగిక దాడి యత్నం

అనంతపురం క్రైం: అనంతపురం రూరల్ పరిధిలోని అక్కంపల్లి ధర్మభిక్షం కాలనీలో బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కాలనీలో తమ్ముడితో కలిసి ఆడుకుంటున్న ఓ బాలికకు అదే కాలనీకి చెందిన ఎస్.బాషా (50) అనే వ్యక్తి మాయమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్లాడు. ఎవరూలేని సమయం చూసి లైంగికదాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా అప్పుడే అటువైపు వచ్చిన బాలిక తల్లి చూసి కేకలు వేసింది. దీంతో బాషా అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు బాషాపై పోక్సో చట్టం కింద రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి