మతిస్థిమితం లేకనే చంపేసింది | Mental Illness Mother Eliminates Her Daughter At Husnabad | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం లేకనే చంపేసింది

Jul 9 2021 1:39 PM | Updated on Jul 9 2021 1:41 PM

Mental Illness Mother Eliminates Her Daughter At Husnabad - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ మహేందర్‌

అక్కన్నపేట(హుస్నాబాద్‌): తల్లికి మతిస్థిమితం సరిగా లేకనే కూతుర్ని రోకలిబండతో కొట్టి చంపిందని అడిషనల్‌ ఎస్పీ సందేపోగు మహేందర్‌ అన్నారు. అక్కన్నపేట మండలం మల్‌చెర్వుతండాలో తొమ్మిదేళ్ల ‘కూతురునే  కడతేర్చిన కన్నతల్లి’ జరిగిన దారుణ సంఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం హుస్నాబాద్‌లోని సీఐ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తల్లి మమత అలియాస్‌ రాణిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన వివరాలు వెల్లడించారు. భూక్య తిరుపతి, మమత దంపతుల పెద్ద కూతురు భూక్య సోని(09) వంట చేసేందుకు ఇంట్లో బియ్యం తీస్తున్న క్రమంలో కోపోద్రికురాలై తల్లి రోకలిబండతో కూతురి తలపై బలంగా కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిందన్నారు. తల్లికి సరిగ్గా మతిస్థిమితం లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని విచారణలో తెలిందన్నారు. ఈ సమావేశంలో సీఐ లేతాకుల రఘుపతిరెడ్డి, ఎస్సై కొత్తపల్లి రవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement