దారుణం: పుట్టింటికి వెళ్లొద్దన్నందుకు ఎంత పనిచేసింది.. | Married Women Commits Departed In karnataka | Sakshi
Sakshi News home page

అధికారి భార్య ఆత్మహత్య

Jun 9 2021 12:58 PM | Updated on Jun 9 2021 1:01 PM

Married Women Commits Departed In karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మైసూరు(కర్ణాటక): తన పుట్టింటికి వెళ్లడానికి భర్త ఒప్పుకోక పోవడంతో మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైసూరు నగరంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. నగరంలోని మానసినగరలో నివాసం ఉంటున్న బాలాజీ, విద్యాలక్ష్మీ (24) తమిళనాడు వాసులు. బాలాజీ వాణిజ్య పన్నుల శాఖలో సీనియర్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు.

అయితే భార్య పుట్టింటికి వెళ్లడానికి అంగీకరించకపోవడంతో సోమవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన విద్యాలక్ష్మీ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మైసూరు దక్షిణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.  

చదవండి: దివ్యాంగురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆపై

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement